జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
బైక్ ను ఢీకొట్టి లారీ బోల్తా ఇద్దరు యువకుల దుర్మరణం జక్రాన్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జక్రాన్ పల్లి మండలం వివేక్ నగర్ తాండ సమీపంలో శుక్రవారం సాయంత్రం బైక్ ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో లారీ అతివేగంగా ఉండడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో వివేక్ నగర్ తాండకు చెందిన భానోత్ శ్రీను, కేశ్ పల్లి తాండకు చెందిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు....