30.9 C
Hyderabad
Monday, August 3, 2026

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎడ్ల కట్ట వాగు, అంతంపల్లి, లక్ష్మీ దేవునిపల్లి నష్టపోయిన వారి పంటలను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే అసెంబ్లీలో కాటిపల్లి రమణారెడ్డి పంటలు నష్టం గురించి మాట్లాడుతున్నారని వారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తే ఈరోజు రైతులకు అండగా ఉండేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఫసల్ బీమా అమలు చేయాలని రైతులకు ఎకరాకు రూ.20,000 పంట నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్,  కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, సాయి రెడ్డి, తిరుమలేష్, వల్ల కొండ రవీందర్ ,నరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి బిజెపి కార్యకర్తలు ఉన్నారు.

Farmers who have suffered losses due to untimely rains should be supported.

More articles

Latest article