బ్యాంకు ఎదుట రైతుల నిరసన

0 1,292

బతుకమ్మ, పిట్లం : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ (కలాన్)లో దక్కన్ గ్రామీణ బ్యాంకు ఎదుట రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. మాజీ సర్పంచ్ మందాడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రైతులు బ్యాంకు వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. ఎన్నికల హామీ మేరకు రూ.2లక్షల రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. త్వరలోనే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని అన్ని గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సింధే హాజరవుతారన్నారు. నాయకులు శ్రావణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్, రైతు ఎల్లయ్య, దుంపల చిన్న సాయిలు, మాడ సాయిలు, గైని నాగరాజు, బంగారం లక్ష్మణ్, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.