27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సూపర్ మార్కెట్‌లో చోరీకి విఫలయత్నం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ :  రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో దొంగల విఫలయత్నం చోటుచేసుకుంది. కందకుర్తి రోడ్‌లో గల సూపర్ మార్కెట్‌కు శనివారం  రాత్రి దొంగలు గ్యాస్ కట్టర్ సాయంతో షెట్టర్‌ను కత్తిరించి దొంగతనానికి ప్రయత్నించారు. ఈ సమయంలో లోపలే నిద్రిస్తున్న సూపర్ మార్కెట్ యజమాని, షెట్టర్ పగలగొడుతున్న శబ్దాన్ని గమనించి కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు.  అలాగే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి, దొంగల కోసం అన్వేషణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

More articles

Latest article