- ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్
రుద్రూర్, బతుకమ్మ : రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఉర్దూ అకాడమీక్ చైర్మన్ తాహెర్ బీన్ హందాన్ అన్నారు. మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తాహెర్ బీన్ అందాన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తోందని ఆరోపించారు. పేద ప్రజలకు పంపిణీ చేసే సన్నం బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని గొప్పలు చెప్పుకునే బిజెపి నాయకులు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు సన్నం బియ్యం పంపిణీ చేయడం లేదని ధ్వజమెత్తారు. బిజెపి కలిబొల్లి మాటలు విని మోసపోవద్దని, కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో సుస్థిర పాలన సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, దిశా కమిటీ మెంబర్ నడిపింట నగేష్, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ నిస్సార్, మాజీ ఎంపీటీసీ షేక్ గౌస్, తోట సంగయ్య, డాక్టర్ రఫీ ఖద్రి, కుర్మాజీ సాయిలు, సుదర్శన్ గౌడ్, పట్ల సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.