మోర్తాడ్, బతుకమ్మ :
గ్రామం లో ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని గ్రామ సర్పంచ్ పెగడ విజయ్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం రాజ్యాంగం లో పౌరులకు కల్పించిన హక్కుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిరాం, వార్డ్ సభ్యులు, వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులు, సాయికుమార్ గౌడ్, సుమలత, రెవిన్యూ జీపీఓ అన్వేష్, పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
