27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అందరం ఒక్కటే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : కులమతాలకు అతీతంగా మనం అందరం ఒక్కటే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇఫ్తార్ విందులో గురువారం సాయంత్రం పాల్గొన్నారు. టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలో గల తన గన్‌మెన్ అజార్ నివాసంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో ఆయన

Everyone should have the feeling that we are all one.

ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “ఈ దేశ సంస్కృతి మతసామరస్యంపై ఆధారపడి ఉందని అన్నారు. ఇలాంటి సందర్భాలు అన్నీ మానవీయ విలువలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ రూరల్ సీఐ బి. శ్రీనివాస్, టౌన్ 5 ఎస్‌ఐ ఎమ్. గంగాధర్, ముస్లిం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Everyone should have the feeling that we are all one.

More articles

Latest article