24.7 C
Hyderabad

కళాశాలలో మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీల ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న మాదకద్రవ్యాల వినియోగం యువత జీవితాలను పాడు చేస్తుందని, దీనిని నివారించటానికి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యాసంస్థలో మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఎంపిక చేసిన అధ్యాపకులకు గురువారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమంలో మాదకద్రవ్యాలు వాటి దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. మనం తక్షణం మేల్కొని అప్రమత్తంగా  మన యువతను కాపాడుకోవాలని అన్నారు. నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నుండి కోఆర్డినేటర్ రమేష్ గౌడ్, సభ్యులు డా. ఏం. రామస్వామి, డా. పి. రామకృష్ణ పాల్గొన్నారు.

Establishment of drug control committees in colleges

More articles

Latest article