- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంజనీర్స్ డే ను పురస్కరించుకొని నిజాంబాద్ పాలిటెక్నిక్ కళాశాల లో పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సాయి చైతన్య ఐపీఎస్ విచ్చేసి పూలమాలతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను రిటైర్డ్ ఇంజనీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ చాలామంది ఇంజనీర్ ఈ దేశంలో పనిచేశారు. కానీ మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య ను ఎందుకు జన్మదినాన్ని ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్నాం. వారు దేశానికి చేసినటువంటి సేవలు ఇంజనీరింగ్ విభాగంలో వినూత్నమైనటువంటి సేవలు మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి భారతదేశానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం జరిగింది. వారి జన్మదిన జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి ఇది నీకు పునాది ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా బాగా కష్టపడి చదివి మీకు మీ తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే ఎవరు కూడా డ్రగ్స్ మహమ్మారి నీ పారదొవ సంవత్సరం ముందు యువత ట్రాఫిక్ రూల్స్ పాటించి హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ ను మన నుంచి దూరం ఉంచుకోవడానికి యువత ముందుండాలి. ఇంజనీర్స్ ఈ దేశానికి నిర్మాతలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పి.భారతి ప్రిన్సిపల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్ సహా అధ్యక్షుడు కేఎల్వి రమణ , సంయుక్త కార్యదర్శిసత్యనారాయణ, వినోద్, మోహన్ కుమార్, బాలచందర్, బాబా శ్రీనివాస్, వై గణేష్, కళాశాల అధ్యాపకులు నాగరాజ్ ,నరేష్ కళాశాల అధ్యాపకులు మరియు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

