29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

అలిపిరి దాడుల సూత్రధారి నంబాల ఎన్ కౌంటర్

Must read

📰 Generate e-Paper Clip

ఖమ్మం, బతుకమ్మ: ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు(66) మృతిచెందారు. ఎన్ కౌంటర్ లో మొత్తం 28 మంది మావోలు కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో జరిగిన బాంబుదాడిలో నంబాల కేశవరావు ప్రధాన సూత్రధారి.

మోస్ట్ వాంటెడ్ అయిన నంబాలపై రూ.1.5 కోట్ల రివార్డు ఉంది. నంబాల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట కాగా, వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఎంటెక్ చదువుతున్న సమయంలో అప్పటి పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు.

2010లో ఛత్తీస్ గఢ్ లో జరిగిన దాడుల్లో 76 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటనకు సూత్రధారిగా నంబాల కేశవరావు వ్యవహరించారు.

More articles

Latest article