26.3 C
Hyderabad

 అక్రమ దుకాణ సముదాయాల తొలగింపు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల పక్కన అక్రమంగా వెలిసిన దుకాణ సముదాయాలను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. గత కొంతకాలంగా మెడికల్ కళాశాల పక్కనే గల దుకాణ సమూహాల వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఇతర సమస్యలు ఏర్పడడంతో  ఈ సమస్య కమిషనర్ దృష్టికి రావడంతో ట్రాఫిక్ పోలీసుల సహకారంతో దుకాణ సమూహాలను తొలగించారు.జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల మార్కెట్లకు ప్రజలు, నగరవాసులు ఈ రోడ్డు గుండా వెళ్లడం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చడంతో ఈ సమస్యకు శాశ్వతంగా పుల్ స్టాప్ పెట్టడానికి ఈ చర్యలు తీసుకున్నట్లుమున్సిపల్ అధికారులు తెలిపారు.

Removal of illegal shop groups

More articles

Latest article