28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదు

Must read

📰 Generate e-Paper Clip

. . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 హైద్రాబాద్, బతుకమ్మ:

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్నది దాని ప్రకారం బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ సంఘాలతో సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  మీడియాతో మాట్లాడుతు.. జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారు. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదు అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వం  మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తాం అని కవిత హెచ్చారించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాకా, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలి .అంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు అన్నారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తాం అని కవిత తెలిపారు.

More articles

Latest article