కామారెడ్డి, బతుకమ్మ : పంచాయతీ ఎన్నికలు రెండు తండాల మధ్య పంచాయితీ తెచ్చాయి. ఓటర్లు ఎక్కువున్న తండావాసులు తమకు అవకాశం దక్కకుండా చూస్తున్నారని ఆరోపిస్తూ మరో తండావాసులు ఎన్నికల బహిష్కరణకు సిద్ధమయ్యారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో మీది తండా, కింది తండాలున్నాయి. మీది తండా లో 350 ఓట్లు, ఐదు వార్డులు ఉండగా.. కింది తం డాలో 250 మంది ఓట్లు, మూడు వార్డులు ఉన్నాయి. 2019లో ఈ గ్రామపంచాయతీకి మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మీది తండావాసులు తమ గ్రామానికి చెందిన వ్యక్తిని సర్పంచ్ గా ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. జనాభా ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా ఆ తండావారే సర్పంచ్ ను వేలం పాట ద్వారా ఎన్నుకోవాలని చూస్తున్నారని కింది తండావాసులు ఆరోపిస్తున్నారు. తమ తండా లో ఓటర్లు తక్కువగా ఉండడంతో పట్టించుకోవడం లేదని, వేలంలో కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా కింది తండా నుంచి వార్డు స్థానాలకు నామినేషన్ వేసిన ముగ్గురు అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన ఇద్దరు మాత్రం బరిలోనే ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా మీది తండా నుంచి ఒకరు, మా తండా నుంచి ఇద్దరం పోటీ లో ఉన్నాం. మీది తండా అభ్యర్థి తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని చెప్పుకుం టున్నాడు. వాళ్లు మమ్మల్ని లెక్కలోకి తీసుకోవడం లేదని వారు వాపోతున్నారు. మీది తండాలో ఓట్లు ఎక్కు వగా ఉన్నాయి. దీంతో వారు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. మా తండాకు సంబంధం లేకుండానే సర్పంచ్ పదవిని వేలం వేసుకుని ఒక అభ్యర్థిని నిలబెట్టారు.