రెండు తండాల మధ్య ఎన్నికల చిచ్చు
కామారెడ్డి, బతుకమ్మ : పంచాయతీ ఎన్నికలు రెండు తండాల మధ్య పంచాయితీ తెచ్చాయి. ఓటర్లు ఎక్కువున్న తండావాసులు తమకు అవకాశం దక్కకుండా చూస్తున్నారని ఆరోపిస్తూ మరో తండావాసులు ఎన్నికల బహిష్కరణకు సిద్ధమయ్యారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో మీది తండా, కింది తండాలున్నాయి. మీది తండా లో 350 ఓట్లు, ఐదు వార్డులు ఉండగా.. కింది తం డాలో 250 మంది ఓట్లు, మూడు వార్డులు ఉన్నాయి. 2019లో ఈ గ్రామపంచాయతీకి మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో...