26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ట్రస్మా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఆర్మూర్ శ్రీ భాషిత పాఠశాలకు చెందిన పోలపల్లి సుందర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ ఆర్కెడ్ పాఠశాలకు చెందిన అనుముల క్రాంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కోశాధికారి రాఘవేందర్ రెడ్డి, పరిశీలకులుగా వేదం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ త్వరలోనే మిగిలిన పదవులను భర్తీ చేస్తామని తెలిపారు. ప్రయివేట్ పాఠశాలల అభివ్రుద్ధికి క్రుషిచేస్తామని, యాజమాన్యాల సమస్యలపై పోరాడుతామని తెలిపారు.

Election of Trusma President and General Secretaries

More articles

Latest article