ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలానికి చెందిన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. నల్లవెల్లికి గ్రామానికి చెందిన నీరడి గంగాధర్ ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పూజం రవికుమార్, ఉపాధ్యక్షులుగా శ్రీపతి జితేందర్, సంయుక్త కార్యదర్శిగా పాశం నరసయ్య, కోశాధికారిగా రాకేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా జెగ్గ రాములు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు నీరెడీ గంగాధర్ మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యల కోసం ముందుండి పోరాడతానని, అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నారు. పత్రిక రంగం చాలా విలువైనదని దీనిని ప్రతి ఒక్కరు పత్రిక రంగాన్ని విలువల్ని కాపాడాలని అన్నారు.
