నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ గా నియమితులైన వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలల ప్రత్యేక అధికారి జి.వి.శ్యాంప్రసాద్ లాల్ గురువారం కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. జనరల్ అబ్జర్వర్ కు పూలమొక్క అందించి స్వాగతం పలికిన కలెక్టర్, జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు. చేసిన ఏర్పాట్ల గురించి తెలియజేశారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనరల్ అబ్జర్వర్ కు ఫిర్యాదులు, సూచనలు చేయదలచిన వారు సెల్ నెంబర్: 6309505554 కు ఫోన్ చేయవచ్చని, మెయిల్ ఐ.డీ: observergpelec.nzb@gmail.com ద్వారా కూడా తెలుపవచ్చని ఎన్నికల పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సూచించారు.

