29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

లారీ ఢీకొని వృద్ధుడి మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధుడ్ని లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈఘటన నిజామాబాద్​ నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దుబ్బ చౌరస్తా  వద్ద బుధవారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న సుంకరి నర్సయ్య(68)ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను స్థానికులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నర్సయ్య మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు.

More articles

Latest article