25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోమన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటుకు, ఇంటర్నేషనల్ సిమ్మింగ్పూల్ కూడా ఏర్పాటు అయ్యేలా తన వంతు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించిన మదనన్న కబడ్డీ పోటీలలో గెలుపొందిన జట్లకు శనివారం ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  మదనన్న కబడ్డీ పోటీలను చాలా గొప్పగా నిర్వహించారని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణని అభినందించారు. 300 డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు రిపబ్లిక్ డే సందర్భంగా అర్హులకు అందజేస్తానని తెలిపారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్ త్వరలో పూర్తి అవుతుందని, మినీ ట్యాంక్ బండ్ పైన అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేసి QR క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో ఆ స్వర్గస్తులైన ఎమ్మెల్యేల పూర్తి వివరాలు (జీవిత చరిత్ర) తెలిస్తుందని అన్నారు. మినీ ట్యాంక్ బండ్ పై లైటింగ్, ఫుడ్ కోర్టు, వాకింగ్ చేయడానికి వీలుగా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Efforts are being made to set up a mini stadium

More articles

Latest article