బీ ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

0 2,200

భిక్కనూర్, బతుకమ్మ: రైతులకు షరతులు లేకుండా రూ.2లక్షల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రజాభవన్ ముట్టడికి బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ స్థానిక నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తెల్లవారుజామున 5.30గంటలకు హైదరాబాద్ కు బయల్దేరి వెళ్తున్న బీఆర్ఎస్  నాయకులను  ఎస్సై సాయికుమార్ స్టేషన్ తరలించారు. అరెస్టైన వారిలో బీఆర్ఎస్ మండల జనరల్ సెక్రెటరీ అత్యల్లి శ్రీనివాస్, రైతు విభాగం అధ్యక్షుడు తక్కల రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దాయరి సాయిరెడ్డిని అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.