బతుకమ్మ, జుక్కల్ : ఆశ కార్యకర్తల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ వెళుతున్న జుక్కల్ ఆశ కార్యకర్తలను జుక్కల్ పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. దీన్ని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ పోలీసుల తీరుపై తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.