27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సీపీ కల్మేశ్వర్ సిబ్బందికి సూచించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. బాగుగోలను అడిగి తెలుసుకున్న ఆయన సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) కోటేశ్వరరావు, అదనపు డీసీపీ (లాఅండ్ఆర్డర్ ) బస్వారెడ్డి, ఆర్మూర్, బోధన్, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, ఆర్డ్మ్ రిజర్వ్ సీసీఎస్ తోపాటు ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  


Duties should be performed with discipline

More articles

Latest article