24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రశాంత వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలు జరుపుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎస్సై సాయన్న

 

రుద్రూర్, బతుకమ్మ : ప్రశాంతమైన వాతావరణంలో దుర్గమాత ఉత్సవాలను జరుపుకోవాలని రుద్రూర్ ఎస్సై సాయన్న సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై సాయన్న శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన  వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. దుర్గామాత ఊరేగింపులో డీజే బాక్సులు  పెట్టవద్దని, విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల దుర్గామాత కమిటీ నిర్వాహకులు, మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article