23.4 C
Hyderabad

రూ.3.5కోట్ల విలువైన మత్తుపదార్థాలు ధ్వంసం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రూ.3.5కోట్ల విలువైన మత్తుపదార్థాలను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ స్టేషన్ ఫరిధిలో 60 కేసులలలో పట్టుబడిన 3.5 కోట్ల విలువైన 1007.02 కేజీల ఎండు గంజాయి, 35 కేజీల గంజాయి చాక్లెట్లు, 7 కేజీల డయాజెపామ్, 8 కేజీల అల్ప్రాజోలం, 2 గంజాయి మొక్కలను జక్రాన్పల్లి మండలంలోని పడకల్ లోగల ఎంఎస్ మెడికేర్ లో ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, బోదన్‌, ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌ఓలు దిలీప్, స్టీవెన్సన్, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article