30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రాంతీయ చెరకు, వరి పరిశోదన స్థానం నూతన అధిపతిగా డా.పవన్ చంద్ర రెడ్డి బాధ్యతలు స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన స్థానం, రుద్రూర్  ప్రధాన శాస్త్రవేత్త, అధిపతిగా పవన్ చంద్రరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మృతికా శాస్త్రంలో పి. హెచ్ డి (డాక్టరేట్ ) పూర్తి చేశారు. 2007 నుండి 2013 సంవత్సరం వరకు శాస్త్రవేత్తగా రుద్రూర్ పరిశోధన స్థానంలో తమ సేవలను అందించారు. 2013 సంవత్సరంలో నిజామాబాద్ ఏరువాక కేంద్రంలో బదిలీ పై వెళ్లి 2017 వరకు అధిపతిగా పనిచేశారు. ఆ తరువాత 2017 నుండి 2018 సంవత్సరంలో ఆరు నెలల పాటు, పదోన్నతి పై సీనియర్ శాస్త్రవేత్తగా రుద్రూర్ పరిశోధనా స్థానంలో పనిచేశారు. 2018 నుండి 2023 వ సంవత్సరం వరకు వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ హోదాలో పనిచేశారు. 2023 నుండి 2025 సంవత్సరం వరకు హైదరాబాద్ లో ఉన్న నేల ఆరోగ్య యాజమాన్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు.  నిజామాబాద్ వాస్తవ్యులైన పవన్ చంద్రారెడ్డి బదిలీపై వచ్చి ఈరోజు ఉదయం ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్త, అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. బోధన, బోధనేతర సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.

More articles

Latest article