భీమ్ గల్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇటీవలే మరణించడంతో వారి కుటుంబాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ కానిస్టెన్సీ పార్టీ ఇంచార్జ్ డాక్టర్. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలంలోని బెజ్జోరా గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త నారాయణ అనారోగ్యం కారణంగా గత నాలుగు రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మండలంలోని జాగిర్యాల గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త చెగంటి పెద్ద రాజన్న అనారోగ్యంతో ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి భాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్, పార్టీ సీనియర్ నాయకులు యోగేశ్వర నర్సయ్య,, బండారి లక్ష్మణ్ గౌడ్, ఈర్ల మహేందర్, పల్లికొండ ప్రసాద్, సంధ్యా రాజు, శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
