29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

చెడు అలవాట్లకు బానిసలు కావద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

 

ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాలలో గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్,సిఐ డిచ్పల్లి ఆధ్వర్యంలో  ఇందల్వాయి  పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మాక్లూర్ తాండ గ్రామంలో ఏకలవ్య స్కూల్ లో డ్రగ్స్, మత్తుపదార్థాలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా  ప్రజలకు  వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలు , పలు సూచనలు చేశారు.మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు,మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయన్నారు.మాదకద్రవ్యాల వినియోగం నేరం – చట్టపరమైన శిక్షకు లోనవుతానన్నారు.యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలన్నారు.ఆన్లైన్ మోసాలు,సైబర్ మోసాల నుండి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫోన్ చేయలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వినోద్ రెడ్డి,ఎస్సై సందీప్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Don't become addicted to bad habits.

More articles

Latest article