ప్రభుత్వ పాఠశాలలో నీటి కొరత తీర్చేందుకు దాతల ముందడుగు

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామానికి చెందిన యంగ్ స్టార్ యూత్ సభ్యులు ముందుకు వచ్చారు. పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం అనంతరం ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు పాఠశాల ఆవరణ వెలుపలికి వెళ్లాల్సి వస్తోందని, అలాగే నీటి కొరత కారణంగా కొంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా ఉంటున్నారని జూలై 14న బతుకమ్మ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన గ్రామానికి చెందిన...