29 C
Hyderabad
Monday, August 3, 2026

రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి కి రూ.లక్ష విరాళం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నవీపేట్ : పురాతన, ప్రఖ్యాతి గాంచిన నాలేశ్వర్ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి కి గ్రామానికి చెందిన కమలాకర్ రావు దేశముఖ్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం లక్ష రూపాయల చెక్ ను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు కిరణ్ దేశముఖ్ చేతుల మీదుగా నాలేశ్వర్ గ్రామ అభివృద్ధి కమిటీ కి అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ దేశముఖ్ మాట్లాడుతూ ప్రశస్తి కల్గిన నాలేశ్వర్ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల సహకారాలు అందించేలా కృషి చేస్తానని తెలిపారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం లక్ష రూపాయలు అందజేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడిసి సభ్యులు మోహన్, స్వామి, సుధాకర్, శైలజ దేశముఖ్, గుండెరావు దేశముఖ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article