23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

రక్తదానం ఇతరులకు ప్రాణదానం

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయిచైతన్య

 

నిజామాబాద్, బతుకమ్మ : మనం చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా (పోలీస్ ఫ్లాగ్ డే) పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో బుధవారం రక్తదాన శిబిరం” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవవలలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటంలో తమ వంతు సహయంగా రక్తదానం చేయడం అనేది ఒక సామాజిక కార్యక్రమం అని అన్నారు. ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. మీరు ఒకరి ప్రాణం కాపాడినవారు అవుతారని తెలియజేశారు. ఈ రక్తదానం చేయడం ద్వారా మనం  ఎందరికో  కొత్తజీవం అందించిన వారు అవుతారు అని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 177 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం రక్త దానo చేసిన వారికి పోలీస్ కమిషనర్ హెల్మెట్ లు ప్రదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో అదనపు డి.సి.పి (ఎ.ఆర్) రామ్ చందర్ రావ్, నిజామాబాద్ ఎ.సి.పి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఎ.సి.పి. మస్తాన్ అలి, పోలీస్ యునిట్ ఆఫీసర్ డా॥ సరళ, రిజర్వు ఇన్స్పెక్టర్ సతీష్, శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ హాస్పటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ఇమ్రాన్ అలీ, సి.ఐలు, ఎస్.ఐలు, మోక్ష డ్రెస్సెస్ యాజమాన్యం ప్రవీణ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, ప్రభుత్వ హాస్పటల్ సిబ్బంది, పోలీస్ యునిట్ హాస్పటల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Donating blood is donating life to others.

More articles

Latest article