రక్తదానం ఇతరులకు ప్రాణదానం
పోలీస్ కమిషనర్ సాయిచైతన్య నిజామాబాద్, బతుకమ్మ : మనం చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా (పోలీస్ ఫ్లాగ్ డే) పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో బుధవారం రక్తదాన శిబిరం" నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని అన్నారు....