బతుకమ్మ, ఏర్గట్ల: చిట్టాపూర్ గ్రామ వాస్తవ్యుడు, వసంత టూల్స్ క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రముఖ పారస్రామికవేత్త ఏనుగు దయానంద రెడ్డి తడపాకల్ ఉన్నత పాఠశాలకు 50 వేల రూపాయలు విలువచేసే వాలీబాల్ నెట్ కోకో సామాగ్రి, స్కూల్ పిల్లలకు క్రీడా దుస్తులు, ఒక లక్ష విలువ చేసే డెస్క్ స్కూల్ బెంచీలు అందజేసినందుకు, ఏనుగు దయానంద రెడ్డి కి, బాల్కొండ పిడి రాజకుమార్,చిట్టాపూర్ గణేష్ టీచర్ కు పాఠశాల తరఫున గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ జావిద్, ఉపాధ్యాయులు కృష్ణ ప్రసాద్,పిడి ఆనంద్, సుధాకర్,గంగాధర్, భూపతి,నవీన్,గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంబటి రాజేశ్వర్,ప్రకాష్ రెడ్డి,అట్లా శ్రీనివాస్,మనోజ్,లు పాల్గొన్నారు.
