24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మ్యూటేషన్ కావాలా లకారం ఇవ్వాల్సిందే..?

Must read

📰 Generate e-Paper Clip

  • బల్దియా లో ‘రెవెన్యూ’ ఎవరికి..?
  • మున్సిపల్ కార్పొరేషన్ కా.. అధికారులకా..?
  • ఆస్థిపన్ను తగ్గించాల లేక పెంచాలన్న వారు చెప్పిందే వేదం
  • వందల కొద్ది మ్యూటేషన్ ఫైళ్లు పెండింగ్ లోనే
  • టాక్స్ రికవరీ చేయకుండా బల్దియా ఆదాయానికి గండికొడుతున్న వైనం
  • ఎన్ఎంసీలో ఏసీబీ దాడులతో వెలుగులోకి అవినీతి అక్రమాలు

 

 నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన ఆయనో పేరుమోసిన న్యాయవాది. న్యాయం కోసం ప్రభుత్వంను, పోలీస్ వ్యవస్థను కోర్టులో నిలబెట్టి పీడితులు, బాధితులకు న్యాయం చేసిన లాయర్. దశాబ్ధాల కాలం పేదల కోసం ఫీజులు తీసుకోకుండా పనిచేసిన వ్యక్తి గత ఏడాది క్రితం కాలం చేశారు. ఆయనకు సంబంధించిన ఆస్థి(ఇంటిని) అతని సతీమణి పేరు మీదుకు మార్చుటకు (మ్యూటేషన్ ) కోసం నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో దరఖాస్తు చేశారు. డెత్ సర్టిఫికేట్స్ తో పాటు ఫ్యామీలి మెంబర్స్ సర్టిఫికేట్స్ తో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసిన ఇప్పటికి మ్యూటేషన్ కాలేదు. ఎందుకంటే పేరెన్నిక గన్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవిన్యూ అధికారులు  అది లేదు. ఇదిలేదు. అవిసరిగ్గా లేవు… నాలుగు నెలలుగా కాలం వెల్లదీస్తున్నారు. అందుకు కారణం ప్రస్తుతం మ్యూటేషన్ కు లకారం (లక్ష) ఇస్తేనే పని జరుగుతుందంటా. అన్ని సక్రమంగా ఉండి వారసులు, ఫీజులు కట్టిన ఆ ఫైల్ పెండింగ్ లో ఉండటానికి కారణం ఆమ్యామ్యాలు ఇవ్వకపోవడమేనని బాధితులు తెలిపారు.

…………………………………………………………………………………………..

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డి బల్దియా అధికారులతో  సమావేశమయ్యారు. ప్రత్యేక అధికారుల పాలన పనితీరును పరిశీలనకు సమీక్ష నిర్వహించారు. అప్పుడు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవిన్యూ విభాగం బకాయిలు చూసి ఆయన షాక్ కు గురయ్యారు. నిజామాబాద్ నగరంలోని హైద్రాబాద్ రోడ్డులోని రెండు మూడు నక్షత్రాల హోటల్ తో పాటు ఒక ఆసుపత్రికి ఉన్న బకాయిలే రూ.20 కోట్లకు పైగా ఉండటమే. ఎందుకు వాటిని రికవరీ జరుగడం లేదని ఆరా తీయడంతో కోర్టు కేసు అని రెవెన్యూ అధికారులు చెప్పుకొచ్చారు. కాని సంబంధిత నక్షత్రాల హోటళ్లు నిర్మాణంలో తమకు గ్రౌండ్ ప్లోర్, ఫస్ట్ ప్లోర్ మినహ మిగిలిన అంతస్థులు లేవని అక్కడ కార్యకలాపాలు (నష్టాలు వస్తున్నాయని) జరుగడంలేదని బల్ధియా రెవిన్యూ సెక్షన్ తో కుమ్మక్కై దాదాపు దశాబ్ధకాలంగా దందాలు చేస్తున్నాయి. ఈ విషయంను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్ పైన అంతస్థులను కూల్చివేయాలని బల్ధియా అధికారులను ఆదేశించారు. కాని ఇప్పటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఎందుకంటే సంబంధిత బడా బాబుల వద్ద రెవిన్యూ సెక్షన్ లో ఆమ్యామ్యాలు పుచ్చుకున్న భాగొతం బయటకి వస్తుందని భయమే కారణమని టాక్ నడుస్తుంది.

………………………………………………………………………………..

నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎదైన ఖరీదైన ప్రాంతాలు అంటే అది ఖలీల్ వాడి, ద్వారకానగర్, సరస్వతి నగర్, హైద్రబాద్ రోడ్, శ్రీనగర్ ప్రాంతాలు. అక్కడ గజం ధర లక్షలలో ఉండటమే. అక్కడ వందల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ దవాఖానాలు పేదల నుంచి ఫీజుల నుంచి లక్షల రూపాయాల ఫీజులను గుంజడం అనవాయితీ. కాని పేరెన్నికగన్న నిజామాబాద్ మున్సిపల్  కార్పొరేషన్ రెవిన్యూ అధికారులు ఇప్పటికి దవాఖానాలపై కమర్సియల్ గా ఆస్థిపన్ను వసూలు చేయాల్సిన చోట ఇంటి పన్నుమాత్రమే వసూలు చేసి బల్ధియా ఆదాయానికి గండికొడుతున్నారు. అనక ప్రైవేట్ వైధ్యులు, ఇండ్ల యాజమానులతో లాలూచిపడి జేబులు నింపుకోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలో కోట్ల విలువ చేసే ఒక దవాఖానాను ప్రైవేట్ ఫంక్షన్ హల్ గా టాక్స్ వసూలు చేయించడంలో నరేంద్రుడు అనే నామాధేయుడి పేరు ఇప్పటికి మారుమొగుతోంది. వంద పడకల ఆసుపత్రి, ఐదంతస్థుల భవనం, వందల మంది రోగులతో నిత్యం కళకళలాడే ప్రైవేట్ ఆసుపత్రిని ఫంక్షన్ హాల్ గా రికార్డులకు ఎక్కించి ప్రతి ఏటా లక్షల రూపాయాల ఆస్థిపన్ను ఎగవేతకు రెవిన్యూ సెక్షన్ కారణం.

……………………………………………………………………

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెవిన్యూ సెక్షన్ పేరు చెబితే సామాన్యులు మొదలుకొని బడా బాబులు కూడా బెంబెలేత్తుతున్నారు. అక్కడ ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేసి వసూలు చేయడమే అందుకు కారణం. అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా తమ సెక్షన్ పరిధిలో పనిచేస్తున్న రెవిన్యూ ఇన్స్ పెక్టర్ లు మొదలుకొని బిల్ కలెక్టర్ లను కలెక్షన్ కోసం నియమించుకోని చేస్తున్న వ్యవహారం ఇటీవల ఎసిబి దాడిలో ఇంచార్జీ ఆర్ఐ చిక్కడంతో వెలుగు లోకి వచ్చింది. నిజామాబాద్ బల్ధియాకు ఇటీవల వచ్చిన ఓ అధికారి లక్షల రూపాయాలను బడా అధికార పార్టీ నేతకు ఇచ్చుకొని సిఫారసుతో చేరిన తరువాత దుకాణం తెరిచినట్టు వినికిడి. తనను ఎవ్వరు ఎమీ చేయరని పనితీరులో నిక్కచ్చిగా వ్యవహరించడం, వసూళ్ల వ్యవహారంలో పరమ స్ట్రిక్ట్ అని కలరింగ్ ఇచ్చుకొని వసూళ్ల దుకాణం నడుపుతున్నట్టు రెవిన్యూలో టాక్ నడుస్తుంది. రెవిన్యూ సెక్షన్ లో తిష్ట వేసిన నాటినుంచి పైసా లేనిది పని జరుగదని, పైసలు ముట్టనిదే తనవరకు ఎవ్వరు రానివ్వవద్ధని సెక్షన్ లో పక్కా ఆదేశాలన అమలు చేస్తున్నట్టు బల్ధియా మొత్తం కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే గతంలో ఓలీడర్ బాధితుడైన ఓ అధికారి ఇప్పుడు పాలకవర్గం లేదని రెచ్చిపోతున్నారని సంబందిత సెక్షన్ లో గుసగుసలకు పోతున్నారు. ఇటీవల ఎసిబి దాడులు ఒక రెవిన్యూ ఇన్స్ పెక్టర్ రెడ్ హ్యండేడ్ గా చిక్కడంతో బల్ధియా అధికారులు దిద్ధుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. ఐతే బల్ధియాలో మరో ఇద్ధరు అధికారులపై ఎసిబి నజర్ ఉన్నట్లు మున్సిపల్ ఉద్యోగులు చెబుతున్నారు. ఇటీవల ఎసిబి దాడితో దిద్ధుబాటు చర్యలకు అధికారులు  ఉపక్రమించిన కేవలం కార్పొరేషన్ పరిధిలో సెక్షన్ మారుస్థారు గాని వేటు (చర్యలు తీసుకోరని) వేయరనే ధీమా వ్యక్తం అవుతోందని అందుకే బల్దియాలో అధికారులు భయపడటం లేదని చర్చ జరుగుతుంది.

More articles

Latest article