29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దు

Must read

📰 Generate e-Paper Clip

సదాశివనగర్, బతుకమ్మ: ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సదాశివనగర్ మండలం జనగామ గ్రామానికి రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. జూట్ ఫ్యాక్టరీ, రైస్ మిల్లు అంటూ ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారని, గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇప్పుడు పనులను ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే రసాయనాల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతామన్నారు.

More articles

Latest article