29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అనుమతి లేని కళాశాలలో చేరవద్దు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ పట్టణంలోని ఖిల్లా రోడ్ లో ఉన్న షాహిన్ జూనియర్ కళాశాల, కేశాపూర్ లోని నారాయణ జూనియర్ కళాశాలకు ఇంటర్ బోర్డు అనుమతి లేదని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ తెలియజేశారు. ఈ రెండు కళాశాలకు ఇంటర్ బోర్డు నుంచి ఇంత వరకు ఎలాంటి అనుమతి లేదని, అనుమతి లేని కళాశాలలలో విద్యార్థినీ, విద్యార్థులు చేరవద్దని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని, కళాశాలలలో చేరిన తర్వాత బాధపడవద్దని, ఇంటర్ బోర్డు కు ఎలాంటి సంబంధం లేదని జిల్లా ఇంటర్ విద్యా అధికారి స్పష్టం చేశారు.

More articles

Latest article