రేపు జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభం

0 1,256

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ క్రీడా సాధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం నుంచి జిల్లా స్థాయి క్రీడీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడీ పోటీలను నగరంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు గ్రామ పంచాయతి, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఈనెల 16 నుంచి 21వరకు జిల్లా స్థాయి క్రీడీ పోటీలు నిర్వహస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన వారు సోమవారం పాత కలెక్టర్ గ్రౌండ్ లో రిపోర్ట్ చేయాలని అన్నారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయికి పంపిస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.