నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా హోంగార్డ్స్ విభాగానికి శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉలెన్ జాకెట్స్ పంపిణీ చేశారు. వర్షాకాలం, చలికాలంలో విధుల నిర్వహణ కష్టం అవుతదన్నముందు జాగ్రత్తలో నిజామాబాదులోని 369 మంది హోంగార్డ్స్ కు వులెన్ జాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం, చలి కాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ వులెన్ జాకెట్స్ ను సద్వినియోగం చేసుకోవాలని, విధినిర్వహణలో కూడా క్యారీ చేసి అవసర నిమిత్తం ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ విభాగం ఇన్చార్జ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్, వెల్ఫేర్ విభాగం రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి తదితరులు ఉన్నారు.