26.2 C
Hyderabad
Monday, August 3, 2026

క్రీడాకారులకు వాలీబాల్ సామగ్రి పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఆకాంక్ష మేరకు బాన్సువాడలో క్రీడా ప్రోత్సాహం కొనసాగుతోంది. టీచర్స్ కాలనీ 13వ వార్డు యువ నాయకుడు, డిస్ట్రిక్ట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ మొహమ్మద్ గౌస్ బాన్సువాడ ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో స్థానిక వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాన్సువాడ పట్టణం పేరు మరింత వెలుగొందించాలని మొహమ్మద్ గౌస్ ఆకాంక్షించారు. క్రీడా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువతను ఆయన ప్రోత్సహించారు. సామగ్రి అందజేయడంతో క్రీడాకారులు మొహమ్మద్ గౌస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article