26.3 C
Hyderabad

సన్న బియ్యం పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం గౌరారం తాండ గ్రామంలోని రేషన్ దుకాణంలో గురువారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….దేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని,ఇది ఎంతో శుభ పరిమాణం అని అన్నారు.ఎవరు చేయని సాహసోపేత నిర్ణయం తీసుకొని నిరుపేద ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు.ఈ పథకం చిరకాలంగా కొనసాగుతున్న ఎవరు కూడా ఈ పథకాన్ని రద్దు చేసే సాహసం చేయరని ఈ పథకం ద్వారా నిరుపేదలైన రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం చారిత్రాత్మకం అన్నారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు సింగ్,నరేందర్ సింగ్,మహేష్ గుప్తా,రేషన్ డీలర్ గోవింధ్,రామ్ శంకర్,రాజు,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article