23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

సన్నబియ్యం పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :మండలం లోని వెల్లుట్ల గ్రామంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినా తెల్ల రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యం కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లుట్ల కాంగ్రెస్ నాయకులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా సంక్షేమం కోసం పాటు పడే పార్టీ అని అందులో భాగంగా తెల్ల రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్న బియ్యం ఇవ్వటం దేశంలో నే మొట్ట మొదటి రాష్ట్రం అని అన్నారు.ఈ పథకానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి వెల్లుట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల,నాయకుల ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ గంట సాయిలు, ఓబీసీ మండల అధ్యక్షుడు కమ్మరి భాస్కర్,కన్నెబొయిన అంజయ్య, యమా సాయిలు, వెంకట్,, రేషన్ డీలర్ సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article