మోర్తాడ్, బతుకమ్మ: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకోని మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు హిందీ ఉపాధ్యాయురాలు విజయ కుమారి నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయ పాత్రను పోషిస్తూ తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పడం జరిగింది. అనంతరం నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాలలో విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
