27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

హైజీన్ కిట్స్, ఆట వస్తువుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద రాంపూర్ లో స్వప్నిక రేహ ఫౌండేషన్ హైదరాబాద్, కరూర్ వైశ్యా బ్యాంక్ నిజమాబాద్ ఆధ్వర్యంలో పిల్లలకు శానిటేషన్ వస్తువులను,  ఆట పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలను ఆదుకోవడంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిల కు వారి వ్యక్తి గత ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి వారికి హైజిక్  కిట్స్ , వివిధ రకాల ఆట పరికరాలను శానిటేషన్ వస్తువులను అందించడం జరిగింది అని చెప్పారు . ఈ కార్యక్రమంలో కరూర్ వైష్యా బ్యాంక్ మేనేజర్ రాధాకృష్ణ, స్వప్నిక రెహ ఫౌండేషన్ అడ్వకేట్ మరియు ఫౌండర్ మహాలక్ష్మి,  లీగల్ మేనేజర్ మణికంఠ, మెంబర్స్ విజయ దేవి, డాక్టర్ కార్తీక్, యశస్వి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత, సిబ్బంది విటల్, సాయిబాబా, బుజ్జయ్య, నబి, రాజు, శివ నాగేశ్వరరావు, పోతన, స్వరూప, పుష్పలత, నీలిమ, సీఆర్పీగోపాల్, పీఈటీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article