30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కేసీఆర్ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు బోధన్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. అనుక్షణం తెలంగాణ ప్రజల ఆశయాల కోసం పని చేస్తున్న కేసీఆర్ నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రజాక్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బెంజరి గంగారాం, ప్రసాద్ గుప్తా, రవిశంకర్ గౌడ్, శంకర్ గౌడ్, నరేశ్ కుమార్, ప్రవీణ్ కుమార్ జాదవ్, జక్క సంజీవ్ పటేల్, అహ్మద్, సాగర్, నాసిర్, మహేందర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Distribution of fruits to patients on the occasion of KCR's birthday

More articles

Latest article