27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

చిన్నారులకు ఉచిత యూనిఫాంల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పోషకాహారం, సీజనల్ వ్యాధులపై అవగాహన

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలంలోని తోర్తి గ్రామంలోని తోర్తి–1 అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు ఉచిత యూనిఫాంల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కౌడ భూమేశ్వర్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఎత్తు, బరువులను కొలిచి, వారి పోషకాహార స్థితిపై తల్లిదండ్రులకు వివరంగా అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశ వర్కర్లు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, సురక్షితమైన తాగునీటిని వినియోగించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొల్లపల్లి సుమన్ గౌడ్, ఆశ వర్కర్లు కరుణ, సుశీల, అంగన్వాడి కార్యకర్త ప్రేమలత, లబ్ధిదారులు, తోర్తి గ్రామ వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article