సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

0 14,541

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నీది ద్వారా 49 మందికి 11,95,000 రూపాల విలువ గల చెక్కులు అందించడం జరిగిందన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అప్లై చేసుకున్న  లబ్ధిదారుల దరఖాస్తులను వెంటనే సెక్రటరేట్ కి పంపించి చెక్కుల జారీ విషయంలో జాప్యం లేకుండా చూడటం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15%, 20% మాత్రమే చెల్లిస్తుందని లక్షల్లో ఖర్చు ఉంటే 15వేలు, 20వేలు ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్ధిక భారంగా మారుతుందని అన్నారు. భాదితులు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 50% రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేల చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఎమ్మెల్యే హయాంలో సంవత్సరాలు గడిచిన చెక్కులు రాలేదని ఇప్పుడు అప్లై చేసుకున్న 3 నెలల్లో చెక్కులు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యే కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు,మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Distribution of CMRF cheques

Leave A Reply

Your email address will not be published.