ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం నాడు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.పిట్లం మండలానికి చెందిన పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందడం జరిగింది.వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ శబదం రెడ్డి, నాగిరెడ్డి,కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి, బాల్ రాజు, రామ్ రెడ్డి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
