27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మట్టి గణపతుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : జనహిత గణేష్ మండలి 9వ వార్షికోత్సవంను పురస్కరించుకొని మంగళవారం జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము  నందు కార్యాలయ ఉద్యోగులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్   ముఖ్య అతిథిగా హాజరై  వారి చేతుల మీదుగా మట్టి గణపతుల పంపిణీ చేశారు.  జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని శుభాకాంక్షలు తెలుపుతూ పర్యావరణహితమైన మట్టి గణపతి లను పూజించడం మంచి సాంప్రదాయమని.. అదేవిధంగా జిల్లా ఉద్యోగులకు జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా టీజీఈ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, జిల్లా టీజీవోస్ సంఘం అధ్యక్షులు దేవేందర్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎం నాగరాజు, వారి కార్యవర్గ సభ్యులు, టీజీఓస్ జిల్లా కార్యదర్శి సాయి రెడ్డి, వారి కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు అధికారులు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు ఉద్యోగులు పాల్గొన్నారు.

More articles

Latest article