బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను సోమవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేయడం జరిగింది. గ్రామానికి చెందిన కూన రాజేందర్ రూ. 30,500 చెక్కును అందించడం జరిగింది. లబ్ధిదారులు ముత్యాల సునీల్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి దేవేందర్,అనిల్,శ్యామ్ గౌడ్,మహేష్,రాజు,నరేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
