బతుకమ్మ,ఏర్గట్ల: మండలం తడపాకల్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు గ్రామానికి చెందిన ఆరేపల్లి ఆశన్న, సుద్దాల ఆశన్నకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంలో లబ్ధిదారులు మాట్లాడుతూ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి కి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకుధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లోలం రాజు, పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జింక అనిల్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
