28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వృద్దులకు దుప్పట్లు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయం వద్ద అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం సుమారు 20 మంది వృద్ధులకు, యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏలూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వృద్ధులకు, యాచకులకు దుప్పట్లను అందజేయడం జరిగిందన్నారు. అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రత్న వేణి, శ్యామల, ప్రతిమ, విష్ణు, శ్రీ వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ మేక వెంకన్న, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, ఆలయ పూజారులు జంగం శివ అప్ప, యువరాజ్ అప్ప తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article